AT Home Programme in Lok Bhavan : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లోక్‌భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఎట్‌హోం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలు రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు హాజరయ్యారు. అతిథులకు గవర్నర్ స్వాగతం పలికారు. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే లాంటి ప్రత్యేక సందర్భాల్లో గవర్నర్ తేనీటి విందును ఏర్పాటు చేయడం అనేది చాలా ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. పంద్రాగస్టు సందర్బంగా ప్రస్తుత గవర్నర్ శివప్రతాప్శుక్లా తేనీటి విందును ఏర్పాటు చేశారు. లోక్‌భవన్‌లో ఈ కార్యక్రమం అహ్లాదకరంగా సాగుతోంది. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, అధికారులు హాజరయ్యారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్‌కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. లోక్‌భవన్‌లో గవర్నర్ ఎట్‌హోం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.
This is a summary. For the full story, refer to the original source. Public of India presents verified citizen-relevant reporting.